Thursday, November 16, 2017

Myself - Art Man


I don't say I'm the best. But I have the best and best in me, in the form of Art. It's a art of creativity. I would like to share few things in this two decades of my life journey. I have learnt: Never say 'not possible' to any challenge, even it's complicated, do it, or try to do it. When I get an idea, mostly in the thought process of my script, it won't get me out from that. It's like meditation. Sometimes I feel, puzzled in that process, then I work on it, work on it, work on it, and do it until I make it correct. When I get the final phase in that idea stage, I understand the whole complexity of it. I love my work, when I don't love my work, I don't do It. Because, I'm not a worker, I'm a Creative Person.

Tuesday, November 14, 2017

Some One liners from my Pen..

*  చావు అనేది బంధాలు ఉన్నవాడికి నరకం...బాధలు ఉన్నవాడికి స్వర్గం!



* గుండెలోతుల్లో దాగొని ఉన్న బాధను భరిస్తూ బతకడం గొప్ప కాదు...ఆ బాధను జయిస్తూ గెలుపొందడటం గొప్ప!



* బానిస బతుకు బతకడానికేనా అమ్మ ప్రేగును తెంచుకొని మరీ జన్మను పొందావు..? ఇది నీ జీవితం..ఇతరుల కోసం నీ లక్ష్యాలను, ఆశయాలను అణిచివేయాల్సిన అవసరం లేదు.. పోరాడు..గమ్యం చేరేదాక, తన చుట్టూ నక్షత్రాలున్నాయి అని సూర్యుడు ఉదయించడం మానేస్తాడా.. తన కాంతి తనదే.. అలానే ఎవడి జీవితం వాడిది!



* నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తాను.. ఆలోచించినప్పుడు నువ్వు గుర్తొస్తావ్.. నువ్వు గుర్తొచినప్పుడు బాధగా ఉంటుంది.. బాధ కలిగినప్పుడు ఏడుస్తాను.. ఏడుస్తున్న ఆ క్షణాలను నా కళ్ళు భరించలేవు..



* 'స్వార్ధం' అనే పొర 'నమ్మకం' అనే 'నిజాన్ని' చేరేపేస్తుంది..



* " లం*కు, కన్యకు తేడా ఏంటి..? "
" మెదడుకు, మనసుకు ఉన్నంత ! "



* " చచ్చిపోదామని విషం తీసుకున్న, కానీ అది నన్ను చంపలేదు.."
" నీ జ్ఞాపకాలు నన్నెపుడో చంపేసాయి "



* " జీవితంలోని మధురమైన క్షణాలను మనం చూడలేము.. అందుకే ముద్దు, ఏడుపు, కల అన్నీ కళ్ళుమూసుకునే చేస్తాం "



* " ప్రేమంటే....?? "
" తనను చూసినపుడు కలిగే ఆనందంకంటే తాను ఎక్కడ దూరం ఐపోతుందేమోనన్న భయమే ప్రేమంటే.. "



*  We were two, mirror showed only one..
And she said, "I was Killed.." !



*  When wearing a bikini, women reveal 90 % of their body... Men are so polite that they only look at the covered parts.. 🙄
#ChootiyaaSaalaas



*  ఉపవాసముంటేనే దేవుడు అనుగ్రహిస్తాడనుకుంటే పాపం ఆ అడుక్కుతినేవాడు ఎప్పుడో అంబానీ అయ్యుండేవాడు..



*  కసి.. కసి ఉంటె సరిపోదురోయ్, టాలెంట్ ఉండాలి..
టాలెంట్.. టాలెంట్ ఉంటె సరిపోదురోయ్, చాన్సు రావాలి..
ఛాన్స్.. ఛాన్స్ వస్తే సరిపోదురోయ్, రాసిపెట్టుండాలి..
...
రాసిపెట్టి.............
....
#కృష్ణానగర్కథలు



*  నాలోని ప్రతి భాగోద్వేగాన్ని కళ్ళలోనే దాచుకున్న.. బహుశా అందుకేనేమో నా కళ్ళు ఉప్పొంగి ఉంటాయి... సముద్రంలాగ !



*  ఎవరిగురించిరా తెగ ఆలోచిస్తున్నావ్' ?
నేను: ఏంలేదు.. 😒
( ఆ 'ఏం లేదు' ఎవరో కాదు... 'నువ్వే' ! )



*  రక్తంతో తడిసిన ఒక క్రిమినల్ గుడిలో ప్రవేశించచ్చు కానీ రక్తం అంటుకున్న ఒక మహిళ గుడిలో అడుగుపెట్టకూడదా.. వాఁహ్ ఏమి సాంప్రదాయాలు రా సామి.. 😏



*  నాకూ ఆనందంగానే ఉండాలనుంటుంది.. కానీ నాతోనే ఎప్పటికీ ఉన్న బాధను మోసం చేయలేనుగా..



*  అతడు నేషనల్ లెవల్ స్విమ్మర్.. గోల్డ్ మెడలిస్ట్
కానీ ఆమె వదిలేసి వెళ్తున్నప్పుడు విషాదపు క్షణాల్లో అతడి కళ్ళు మునిగిపోక తప్పలేదు..



*  తను: మీ పదాలు చాలా లోతుగా ఉంటాయి, ఎందుకు ?
నేను: నా గాయాలు కూడా..
'నిశ్శబ్దంతో తను, చిరునవ్వుతో నేను చాట్ ని ముగించాము'.






*  To all the aspiring Film Makers out there,
నా దృష్టిలో, ఒక ఆలోచన నుంచి కథ పుట్టాలిగానీ, కథ కోసం ఆలోచించకూడదు..!



*  ఎన్నాళ్ళగుర్తొచ్చావే వానా.. ఎన్నాలనిదాక్కుంటావే పైన' అంటూ వడగళ్ల వానకు పులకరిస్తూ నాట్యం చేస్తోంది మూడంతస్తుల ఇళ్ళులోని బాల్కనీలోనించి గగన.
తన గుడిసె మొత్తం నీటితో నిండి, ఉండటానికి చోటు లేక వర్షంలో తడుస్తూ తల్లడిల్లిపోయి చలికి వణికిపోతోంది అనాధ మయూరి.
ఇదే రా జీవితం బాల్రాజు.



* ఓడినప్పుడు బాదేస్తేనే రా ఆనందం తిరిగిపొందడానికి గెలవాలనే తపన పెరుగుతుంది..



*  I don't measure people by their past, their success or their talent but only by their PASSION. Their fucking Passion ! That is what makes you do wonders..



* సినిమా ఫీల్డులో బాగా పనికొచ్చే జాబు ఏదైనా ఉందంటే.. అది అసిస్టెంట్ డైరెక్టరే. ఇలా అన్నానని అతిగా మురిసిపోకండ్రోయ్.. 'పనికొచ్చే' అంటే 'పని చేయాల్సొచ్చే' అని అర్థం.
#కృష్ణానగర్కథలు



* జ్ఞాపకాలు మిగిల్చే కన్నీరును ఎవ్వడూ దేకడు.. చిందించే చెమటనుంచొచ్చే విజయాన్ని మాత్రమే కోరుకుంటారు. కన్నీరును చెమటగా మార్చుకో.. నిన్నందరూ వెంటపడి మరీ కోరుకుంటారు.



* చిరునామా తప్పిపోయాయేమో పాపం.. ఏడుస్తున్నాయి మేఘాలు.. ఆ కన్నీరే వర్షం.



* పైసలు నీ దగ్గరుంటే ఏదైనా జరుగుద్ది బాసు.. I Repeat 'ఏదైనా'..
పైసల్లేని బతుకు బ్రేకుల్లేని బండి లాంటిది..
ఎటుపోతుందో మనకర్థం కాదు, ఎక్కడాగుద్దో దానికీ తెలీదు.



* కలలుకన్న జీవితాన్ని మోసం చేసుకుంటూ జీతం అనే లంచాన్ని తీసుకుంటూ ఇంకెన్నాళ్లు బతికేస్తావ్ బాసూ..



* నీలో ఉన్న భయం చచ్చినప్పుడే జీవితం మొదలవుతుంది.. ముందా భయాన్ని చంపు, జీవితాన్ని కాదు.



* బ్రతకడానికి కాదు.. గెలుపొందడానికి ఊపిరి తీస్కుంటున్నానని నువ్ ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే నీ జీవితం మొదలైనట్టు.



* ప్రతీసారి కిందపడ్డప్పుడు కాదు.. జ్ఞాపకాలు తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.. ఆ నొప్పి బాధగా మారి విజయం అనే అమ్మ ఒడికి చేరుస్తుంది. నొప్పిని చూసి కన్నీరు కారుస్తే అక్కడే మిగిలిపోతాం. బాధను భరించి ఎగసిపడితేనే భారం తీరి లక్ష్యతీరాన్ని చేరుస్తుంది.. గుర్తుంచుకో.. నొప్పితోనే బాధపడతావా?.. లేక బాధను భరించి ఎగసిపడతావా..?



* మాటలకందని మౌనాన్ని అర్థం చేస్కో.. జీవితాన్ని వినగలుగుతావ్.



Never believe people easily, Believe in yourself

Creativity i believe it always comes from within. If i found a beautiful idea, i would think and sink around the idea. And sometimes it works the opposite way. I have a thought in my mind, and i look for ideas to proliferate that thought. But at the end, I believe in Patience with Passion is the utmost mantra to get succeed as a Writer or Director. In this journey, I met many people, undergone many experiences, which taught me the great lessons in my life book, some people used my work, used to say to send my script through mail, then they cheated me by copying the scripts I wrote. Believe me, looting the creativity is the biggest evil thing, and biggest wreckage to any creative victim, and i have faced that. And I always push myself by adding the words like.. 'Arey Vijay idhi inkaa just sample raa, life inkaa chaalaa nerpistaadi raa'. And i realized that being good all the time also makes me to face the loss, sometimes the evil inside you should come out to deal the things. No one would encourage or help me to develop in my work, especially in this industry. You should encourage yourself, build your work, build yourself with your inner talent, which would surely pays you the success. And i always believe in to ignore the people done bad to you, but never ignore the lessons they had taught me. For the People who have been consistently supporting me or discouraging me, I would like to show them my success. I have never wasted the time counting the bad experiences, but building the very strong me inside which made me to come up with a unconventional subject to make my debut.
And i always owe my guru, great human being Raj Madiraju sir, who brought me out of the extreme bad condition in my life. Sir, I never forget you and that car journey that night in which the words came out from you really changed me inside, without you I would have chosen a wrong path. Even today those words are haunting in my mind. Today i'm here with my work to showcase it to the world. I will surely strive to make myself to travel towards the success, and I'm sure i'll achieve it.
And one last word,
Never believe people easily, Believe in yourself.

#Thyself

Most of us in this confused and brutal world try to carve out a private life of our own, a life in which we can be happy and peaceful and yet live with the things of this world. We seem to think that the daily life we lead, the life of struggle, conflict, pain and sorrow, is something separate from the outer world of misery and confusion. We seem to think the individual, the 'you', is different from the rest of the world, with all its atrocities, wars and riots, inequality and injustice and that this is something entirely different from our particular individual life. When you look a little more closely, not only at your own life but also at the world, you will see that what you are your daily life, what you think, what you feel is the external world, the world about you. You are the world; you are the human being that has made this world of utter disorder, the world that is crying helplessly in great sorrow. It is you, the human being that has built this world. So that world outside you is not different from the world in which you live your private life. This division between the individual and society does not really exist at all. When one tries to carve out a life of one's own, the individual is not different from the community in which he lives. For the individual, the human being has constructed the community, society. I think we ought to be very clear from the beginning that this division is artificial, utterly unreal. In bringing about a radical change in the human being, in you, you are naturally bringing about a radical change in the structure and the nature of society. I think it must be very clearly understood, that the human mind, with all its complexity, its very complicated work, is part of this external world. The `you' is the world and, in bringing about a fundamental revolution - neither Communist, nor socialist, but a totally different kind of revolution, within the very structure and nature of the soul, of yourself , you will bring about a social revolution. It must begin, not outwardly but inwardly, because the outer is the result of our private, inner life.

Death of Life

మరణం.. మాట వినగానే ఇప్పటికి తప్పుకుంటావు, కానీ ఎప్పటికైనా భయపడతావు, ఎందుకంటే మరణమనేది ఒక నిజం. జీవితకాలం నువ్వు సంపాదించిన ఆస్తులు, పంచుకున్న ప్రేమలు, ఏర్పరుచుకున్న బంధాలు, కుమిలిపోయిన క్షణాలు ఇవన్నీ జీవితంలో ఒక భాగం. ఇవేవీ నీతో పాటు చివరివరకు రావు. మరణం నీ కోసం వస్తుంది. నేను అని బతుకుతున్న నిన్ను, అసూయ ద్వారం నుంచి బయటకు తీసుకెళుతుంది. కాలం లేనిదే మరణం, నేను కానిదే మరణం, స్వార్ధం లేనిది మరణం, అసూయద్వేషాలు తెలియనిది మరణం. జీవనం, మరణం రెండూ ఏకమై ఆడుకునే ఆటే నీ జీవితం, ఈ బంధాలన్నిటిని వదిలేస్తావా, లేక ఈ కలుషిత జీవితంలో మరోసారి మునుగుతావా? మరణం వెనుక ఉన్న అందం నీకు తెలియదు. అది అనంతం.

Shades of Day & Night

Shades of Day & Night
As the night progresses, it's darkness is just like the thoughts in my mind, many conflicts undergo in the beneath layers of nerves. A successive interference of sun rays, like conclusion of thoughts into clarification of the nature's mind mingles together to form a great universe like the story in my mind, it's beyond universe.

I Love Night

Night never fails to make you feel comfortable in your own skin.... Let your vision fade and see through those blurry haze.. So many years you have survived....Some under the starry nights and some chasing the black hole.... some you kissed, some you let go, some promised, some broke your heart into pieces, some moved on... some still there to hold you forever, some battle you won, some you lost just like that .... And still you are breathing ....🤗
This is Life which comes in each one of us life with the series of stories, changes, challenges and questions .... and still we survive 😇💫

My Half Year Diary 2017

అర్థ సంవత్సరం గడిచిపోయింది. ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు.. పెద్దగా పీకిందేమి లేదు కానీ, ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్కుంటే మరీ శూన్యమైతే కనిపించలేదు.. ఎంతో కొంత సాధించాను అని చెప్పను కానీ.. కొన్ని నేర్చుకున్నాను అని తేల్చచ్చు. సాదించాల్సింది నీటి బొట్టును కాదు.. సముద్రాన్ని అని గుర్తొచ్చిన ప్రతిసారి ఊపిరి ఎక్కువైపోతోంది.. కానీ నా కలని నేను చేరుకోగలనన్న గట్టి నమ్మకమైతే కుదిరింది. సాధించగలను.. సాధిస్తా.

The Power Lies within you..

ఎవడన్నాడ్రా ఒంటరివని..
ఎవడన్నాడ్రా ఓడిపోతావని..
ఏడ్చి ఏడ్చి ఇంకిపోతున్న ప్రతి కన్నీటిచుక్కా..
బాధను లోలోనే ఒడిసిపట్టుకొనున్న మెదడులోని ప్రతి కణమూ..
కిందపడ్డ ప్రతిసారీ బయటకొస్తున్న మరిగే రక్తపు ధారా..
గెలుపు ఆకలిని పరిచయం చేసే ప్రతి ఆలోచనా..
ఓడిపోకూడదు అని పడుతూ లేచి వేసే ప్రతి అడుగూ..
గమ్యం వాసనని పసిగట్టి మోగే నీ ప్రతి గుండెచప్పుడూ..
ఇవన్నీ.. ఇవన్నీ నీ చుట్టాలే..
ఇవన్నీ నీ గెలుపు అంచుల్లో నీ మొహంలోని వెలుగును చూసేందుకు చీకటిలో తపిస్తున్న నీ స్నేహితులే..
ఇవన్నీ నువ్వే.

Reality of Life

అనుకున్నదంతా జరగడానికి మనమేమి అంబానీలు కాదు.. జరిగిందంతా చెరిపేసుకోడానికి విజయమాల్యాలూ కాదు.. ఓటమి ఎదురైనప్పుడు ఇదంతా ఈశ్వరేచ్ఛ అననుకోవడం మూర్కత్వం.. అలాగని కుంగిపోకు.. ప్రయత్నమే ఆయుధం.. పోరాడడమే మన బలం. అవకాశం అనేది పారే నీరు లాంటిది.. ఎంత ఒడిసి పట్టుకుంటే అంత నిలువ ఉంటుంది.. అది కూడా క్షణ కాలమే. ఆలోపే తాగి మన విజయదాహాన్ని తీర్చుకోవాలి. చివరాకరికి మనమంతా మన్నులో కలిసిపోయేవాళ్ళమే. ఈ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు జీవితం అనే పంట బాగుండడానికి కొట్టే పురుగుమందులే. ఏవి శాశ్వతం కాదు.. మనం మట్టిలో కలిసేముందు ఏవి కనీసం మన నీడని కూడా తాకడానికి ఇష్టపడవు అన్న విషయం తెలుసుకోవాలి. జ్ఞాపకాలు అంటే ఏవో కావు.. మనం విజయం కోసం పరిగెడుతూ కింద పడ్డప్పుడు పడే బాధ, ఆ బాధతోనే గమ్యం చేరిన క్షణంలో వచ్చే కన్నీరే జ్ఞాపకం. బ్రతికున్నన్నాళ్లు ఆశలతో జీవిస్తాం.. చచ్చేముందు జ్ఞాపకాలతో మిగిలిపోతాం. ఇదే జీవితం.

Your Life, Your Struggles

జ్ఞాపకం కన్నీళ్లను మిగులిస్తే.. ఆకలి ఆశయాన్ని ప్రేరేపిస్తుంది. నీ ఆకలే నీ ఆయుధం, కసితో ముందడుగేయ్.. చరిత్ర సృష్టిస్తున్నప్పుడు ఎంతోమంది ఎర్రిపూ*గాళ్ళు నీ దారికి అడ్డొస్తారు, దాటుకుని వెళ్ళు మరీ అడ్డొస్తే చీల్చుకొని వెళ్ళు.. నీ సంకల్పం ముందు వాడెంత, ఇసుకరేణువంత. నీ కష్టాన్ని ఎన్నటికీ, ఎవరికి తెలియనీకు, నవ్విపోతారు. నీ బాధను బయటపెట్టకు, మరింత బాధపడేలా చేస్తారు, వారి ఆనందం కోసం. ఒక్కటే గుర్తుపెట్టుకో.. ఇది నీ జీవితం.. నీ విజయం చూసి గేలి చేసిన వారి గుండెలు అదిరిపోవాలి, అడ్డొచ్చిన ప్రతి పిండం పగిలిపోవాలి. నీ విజయం కోసం నువ్ చేయాల్సింది వెనుకడుగు వేయకపోవడమే. చరిత్రలో నిలిచిన ఎవడైనా పడుతూలేచిన వాడే, గుర్తుపెట్టుకో నిన్ను ఏదైనా ఆపగలుగుతుంది అంటే అది నీ మరణం మాత్రమే. అంత వరకు ఎగిసిపడుతూనే ఉండు, కెరటం లాగ.
(ఈ మాటలు నాకు నేను మాట్లాడుకున్న విజయ భాషితాలు, నాతోపాటు ఉండిపోయే శాశ్వతాలు, నన్ను కుమిలిపోకుండా ఉత్తేజపరుస్తున్న అపరిమిత శక్తి, అదే నేను.)

About Dasari garu

ఆయన గూర్చి విన్నదే గాని ప్రత్యక్షంగా చూసిందిలేదు, మా గురువు చెప్తోంటే ఆనందపడేవాడిని.. ఎందుకు ఆనందపడేవాడినంటే ఆయన గురించి చెబుతున్నప్పుడు మా గురువు కళ్ళల్లో ఆనంద భాష్పాలను చూసాను కాబట్టి, ఆయన గూర్చి దాదాపు మంచే ఎక్కువుగా విన్నాను, కాబట్టి ఆయన గూర్చి మాట్లాడేంత పూర్తి జ్ఞానం నాకు సరిపోవడం లేదు.. కొంతమంది అంటారు ఒకడు చచ్చిపోతేనే వాడి గురించి మాటలు, పోస్టులు, రిప్పులు..ఇలా. కానీ తెగిపోతేనే దారం విలువ తెలుస్తుందని నేను బలంగా నమ్ముతాను, అయినా మానవులం కదా.. మన ఆలోచనలు ఇలానే ఉంటాయి. అయినా 151 సినిమాలు తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క సినిమా తీయడానికి ఎంత పెద్ద తతంగం ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది దాదాపు 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అన్ని చిత్రాలను రూపొందించడం ఊహాద్భుతం. మా గురువు చెప్పేవాడు.. ఆయన తనతో పనిచేసేవారిని ఎంత బాగా చూసుకునేవారని.. ముఖ్యంగా ప్రతిభను గుర్తించి అభినందించేవారని.. ఆ అభినందనలు అందుకున్న ఎంతోమంది నేడు దర్శకులుగా ఉన్నారు. కానీ ఆయన సినీ జీవితం గమనిస్తే ఒక హిట్ వస్తే..మరోటి ఫ్లాప్ గా మారేది. అయినా సరే అలుపెరగకుండా పడుతూ లేస్తూ ఎన్నో ఘనవిజయాలు ఆయన సొంతం. విజయం ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యం అన్నది ఆయన సినీ జీవితం నేర్పిన పాఠం. అదే నాకు, మరెంతో మందికి స్ఫూర్తిదాయకం. హిట్, ఫ్లాప్...ఆయన జీవితంలో ఎన్ని చూసింటాడండి.. అయినా చివరిదాకా సినిమా అనే సముద్రాన్ని ఈది చూపించాడు. ఇక సినీ కెరీర్ చివరిదశలో రాజకీయాల్లో ప్రవేశించి కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయినా నేను ఒక్కటి బలంగా నమ్ముతాను..ఒక వ్యక్తి మంచో చెడో అన్నది అవతలివాడు ఆలోచించే తీరులో ఉంటుంది. వాడు వీణ్ణి మంచి అని అనుకుంటే మంచోడే, చెడు అను భావిస్తే దుర్మార్గుడె ఇంక. అయినా మంచి చెడు అనేవి మనం కల్పించుకున్న ఊహలే.. తప్పులనేవి మానవ సహజం, ఒకడిని తప్పుపట్టే ముందు మనం ఎంత పతీతులమో గ్రహించాలి. శ్రీకృష్ణుడు అంతటివాడు భక్తుల పాయింట్ అఫ్ వ్యూ లో మంచివాడు, మరి చీరలు దొంగలింపబడ్డ మహిళల పాయింట్ అఫ్ వ్యూలో ఎప్పటికి చెడ్డోడే. నేను ఎప్పుడు అవతలోడిలో మంచినే ఎక్కువ చూస్తాను. కాబట్టి దాసరి నాకెప్పుడూ మంచోడే, సినిమా పరంగా, ఇక రాజకీయాలంటారా..ఎవడు దోచుకోలేదండి, రాజకీయం అంటేనే.. దెం**తినడం, సో నో కామెంట్.
కానీ ఎంతటివాళ్ళైనా చివరికి మట్టిలో కలవాల్సిందే ! ఈ సత్యాన్ని మా అమ్మ పోయినప్పుడే నేను జీర్ణించుకున్నాను. సో, నా దృష్టిలో చావు అనేది ఒకరి జన్మకారణకార్యం పూర్తయ్యాక కల్పించబడే శాశ్వతనిద్ర !
'జాతస్య హి దృవో మృత్యుర్దృవం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే న త్వామ్ సోచింతుమర్హసి'
'పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి సోకింప తగదు'.

My take on Reservations in India

తన చెల్లినో అక్కనో ఎవడో వేరే కులం వాడొచ్చి ప్రేమించి, పెళ్ళిచేస్కుంటాను అని అడిగినప్పుడు కులం పేరు చెప్పి అడ్డొచ్చిన యే ఎర్రిపూగాడు రిజర్వేషన్ల మాట మాట్లాడడానికి అనర్హుడు..
అలానే..
కష్టబడడం చేతగాక కులం పేరుతో అవతలి వాడికన్నా తక్కువ మార్కులొచ్చినప్పటికి తరాలుగా జాబులెగరేసుకుపోయే యే లవ్డెక్ పూల్ గాడు రిజర్వేషన్ల మాటెత్తినా వాడ్ని గుద్దమీద తన్ని తరమాలి !

A Tiny note on Female Prostitute

ఇంకా తానేందుకు ఊపిరి తీస్కుంటున్నానన్న బాధను దిగమింగుకుంటూ కుమిలిపోతున్న అంతిమ క్షణాలవి..
సరిగ్గా అప్పుడే తలుపు చప్పుడు మొదలైంది.. ఈమెలోని గుండెచప్పుడు అందుకు ఉలిక్కిపడింది. మల్లెపూలు చేతివేళ్లకు చుట్టుకొని మత్తులో తూలుతూ వచ్చి బేరమాడాడానీచుడు. ఆమెను చూడగానే ఆరాటపడుతూ ఒక నోటు ఎక్కువగానే పెట్టి, తన చేతిని లాక్కొని చీకటి గదిలోకి లాక్కెళ్ళి వదిలాడు. వాడి మృగశ్వాస, తన గాజుల శబ్దం తప్పా మిగితాదంతా నిశ్శబ్దం. మైకంలోనే తన దగ్గరకు వచ్చి పైటకొంగు తీయబోతుండగా, అంతకన్నా ముందే తానే కొంగుజారవిడిచి చేతిలో పట్టుకొని తల దించుకొని ఉన్న ఆమెను చూసి నిలువలేకపోయాడు. వెంటనే వాడు చేతివేళ్లకున్న మల్లెపూలను కిందకు వేసి సీసాలో కొనాకరున్న ఆ కాస్త మత్తుద్రవాన్ని మింగేస్తూ సీసాను కూడా పడేసి రెండు చేతులను ఆమె నడుము మీద వేసి చిదిమేస్తుంటే ఆమె యే భావమూ లేకుండా నిల్చొని ఉంది. వాడు మెల్లగా తనను పడక మీదకు వాల్చి వాడి వస్త్రాలను తీసేయసాగాడు. తనవి కూడా.. ! చిదిమేయబడడమే కార్యంగా చీకటి తప్పా మరో రంగు తెలియని ఆ అబల తన కన్నీటి చుక్కలను తప్ప మరేమీ బయటపెట్టలేని స్థితిలో ఉంది. ఏమో ఈసారి అవి కూడా బయటకు రాలేదు. మల్లెపూలు వాడి కాళ్ళ కింద పడి నలిగిపోతుంటే, ఆమె కంట నీరు మరింత ఇంకిపోతున్నాయి. మరణం ఆమెకు చాలా చిన్న పదమేమో.. ఎందుకంటే అంతకంటే మారణమైన చేష్టలు తాను రోజూ అనుభవిస్తున్నది. రెండు క్షణాల అతీత భావన కోసం చెలరేగే జ్వాలలో తాను రోజు మండి మసైపోతూనే ఉంది. వాడు ఆమె వస్త్రాలను చింపేస్తూ, మీద పాకుతూ వాడిలోని నిజాన్ని ఆమెపై రుద్దాడు. ఆమె నిర్జీవంగా అలానే పడుంది. ఆ నిశ్శబ్ద చీకట్లో వాడు మరింత పెట్రేగి ఆమెను స్తంబింపచేసి వాడిలోని మృగాన్మక వేడిని చల్లార్చుకుని చెమటలు కక్కుతూ సంతృప్తికర నిట్టూర్పును, చిదేమేసిన ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నిర్జీవ స్థితిలో, నివస్త్రి గా పడివున్న ఆ శరీరంలో ఏ స్పందనా లేదు.. తదేకంగా తన చుట్టూ ఉన్న సభ్యసమాజాన్ని తన కన్నీటి ధార రూపంలో ప్రశ్నిస్తున్న శరీరం అది. అవును. ఆమె చచ్చిబతికిపోయింది. చావు అనే చోటు ఇంతకంటే సురక్షంగా ఉంటుందేమోనన్న చిన్న ఆశతోనే, లేక ఉబ్బిఉన్న తన కడుపులోని జీవం బయటకొస్తే తన తండ్రి ఎవరో చెప్పలేకపోతానేమోనన్న భయంతోనే లేక ఆడది పుడితే తన జీవితమే దానికి కూడా వస్తుందేమోనన్న భయానక బాధతోనో.. తన కడుపులోని బిడ్డను కూడా తనతోనే తీసుకుపోయింది.
ఇలాంటి చీకటి కథలెన్నో.. ఎన్నెన్నో.. కొందరు బాల్యంలోనే పెద్దలు బలవంతంగా తమను ఇందులోకి దింపితే, మరికొంతమంది ఉపాధి కోసమని నమ్మింపబడి చిన్నతనంలోనే అమ్మివేయబడుతున్నారు. ఇంకొంతమంది భర్తలు చనిపోతే కుటుంబాన్ని పోషించుకోవడంకోసమో, జల్సాలకు అలవాటుపడో ఇందులో ఉంటున్నారు.
Note: నేను రాసిన పైరాత మాత్రం చిన్నతనంలోనే అమ్మివేయబడి, తన శరీరాన్ని అర్పించి చీకటి జీవితం గడిపి నరకయాతన అనుభవించి తన గర్భంలోని బిడ్డకు తండ్రి ఎవరని చెప్పాలో తెలియని ఓ కన్నీటి చుక్కది.

A small note on Film Vanaja

This is so deep to my heart..
Whatta film it is.. I feel proud to say that.. "This is our Telugu cinema" ! , which won tens of international awards. I never believe that the awards are the things to measure the capacity of a cinema. But, this film #VANAJA is beyond so called awards, which should enlighten those shitty a**es who always bark on Telugu cinema. Every bit of the film is so natural and the extreme natural way of making of the film will surely touches deep inside our souls. This film is completely different from regular cinematic movies where those always trying to impress or satisfy our low minded genetics
The saddest thing about the movie is it is not getting good encouragement from our people. Yes, you heard that right, we, the people of two Telugu states or the people of India ( Most of the 'creative minded' audience or film critiques ) who always try to fcuk themselves (their own regional or national movies) and everytime trying to pinpoint the loopholes in those. And those fcuking idiots always bark 'we cannot get Oscars raa, we cannot get that award ra, this award ra...' Firstly find the real / great intelligence in yourselves i.e in local makers.
I know we live in the society, where English and English movies (foreign movies) are the scales to measure our intelligence levels.
But still, To all those bit**es and mother****ers out there, kindly STOP your intelligent degradation of local cinema to which you always try to place those foreign movies high in the order which you feel satisfying your egoistic/masturdated fcuking minds.
- Vijay Reddy

Baahubali Success

For me..
#Success is not getting fame, making money, reaching high or something else..
But for me, Success is #Baahubali . Yes !
NOT for investing hundreds of crores budget, NOT for making 1k crore massive gross, NOT for getting global attention, NOT for which it is a proud Telugu cinema uplifted our pride globally...
But..?, 
Yes, But for tremendous planning, unstoppable passion, fascinating team work, more than all these, The Dare or Courage to transform a micro level thought into a India's biggest film venture which is larger than HUGE which redefined the meaning of #RealSuccess.
What I learnt from this is.. Anyone can achieve real success as above by believing yourself, your thoughts, your ideas..
First and foremost factor to acheive it is Dareness, Guts for making it into the sets.
BE BRAVE, DARE TO ATTEMPT WHAT YOUR MIND SAYS, Explore your thoughts, ideas, Explore Yourself.
I'm feeling Proud to be a Filmist !

Special Status's Status

ఆనాడు పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసమే పోరాడాడు..ఈనాడు మనం కనీసం ఆ రాష్ట్రం యొక్క హక్కు కోసం ఉద్యమించలేమా?
ఒక సాంప్రదాయ క్రీడ కోసం ఆ రాష్ట్రం మొత్తం ఏకమయ్యారు..పూటకో కూత కూస్తు తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆనాడు నోరు జారి ఇప్పుడు మాట మారుస్తున్న రాజకీయ నాయకుల మెడలు వంచి మన భవిష్యత్ కోసం మన రాష్ట్రం కోసం ఏకమవ్వలేమా?
ఉన్నట్టుండి ఈ హడావిడి ఏంటో అని అపర మేధావి లాజిక్కులు మాట్లాడకండి.. చరిత్ర లోని ఏ విప్లవం అయినా చిన్న అడుగుతోనే మొదలయింది. పోరాడడాం, ఆనాడు మహానుభావులు మనకెందుకులే అనుకోనుంటే ఈనాడు మనం ఇలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదేమో..ఆవును జల్లికట్టు నిరసన మనకు స్ఫూర్తిదాయకం.
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటి ముదనష్టపు కామెంట్లు మానేసి నీ వంతుగా పోరాడటం మొదలెట్టు.. వీలైతే స్పెషల్ స్టేటస్ వలన మన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి నలుగురికి చెప్పు.. ఇంట్లో కూర్చుని వెధవ వెటకారం ఆపి బయటికి రా.. చెన్నై మెరినా జనాలని చూసి లైకులు కొట్టడం కాదు..నీ రాష్ట్రం భవిష్యత్తు గురించి అలోచించి మాట్లాడు..
ఏ రాజకీయ ఎదవ కూడా రాష్ట్రం కోసం నిజంగా చూడట్లేదు.. నటిస్తున్నారంతే. కులం, మతం , ప్రాంతం ఇవన్నీ వదిలేసి పోరాడు. హీరోల కోసం, హీరోయిన్ ల కోసం, రికార్డుల కోసం, గ్రాస్ ల కోసం, షేర్ ల కోసం కొట్టుకుంటారే.. మరి మన రాష్ట్రం కోసం.. మన భవిష్యత్ కోసం?
ఇదంతా మనకెందుకు రా బాబు మనం ఎన్నుకొన్న వాళ్ళు చూస్కుంటారుగా అంటారు కొంతమంది.. ఆ సో కాల్డ్ ఎన్నుకున్న సన్యాసులు ఏమి పీకలేక ఒకడు 5 ఏళ్లు అని మాట అంటే, ఇంకోడు లేదు మా వాళ్లకి 10 ఏళ్ళు కావాలి అని బ్లేడ్ ఏసాడు ఆనాడు.. గుర్తుందా? పోన్లే రాష్ట్రం ఎలాగూ విడిపోయింది, సర్ జీలు చెప్పినట్టు, పెరుగన్నం లాంటి ప్రత్యేక హోదా కోసం ఆశతో ఎదురుచూసిన సగటు నా లాంటి ప్రజల మొహాన వేడికాఫీ లో చిల్డ్ బీర్ కలిపి మొహాన కొట్టినట్టు ప్యాకేజి ని ముందుకు తెచ్చారు. ఈ ప్యాకెజి తో ఏ ముడ్డి తుడ్చలేము..అది వారిికీ తెలుసు. టాక్స్ లు, పెట్రోల్ , డీజిల్ , గ్యాస్, వైన్స్ ఇలా అన్నింటా వసూళ్లు కూడగొట్టి, తిరిగి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటో తెలుసా?
1. కేంద్ర ప్రభుత్వానికి గ్రాస్ ఇన్ కమ్ (నికర నష్టం) లాస్ లో ఉంది అని,
2. మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి వాదనలు వస్తాయని..
మరి విభజన బిల్లు సందర్భంలో ఇవన్నీ కనపడలేదా రా? అన్నిటిని చూస్తూ, భరిస్తూ ఎంతో కాలం మౌనంగా ఉంది ఇక ఓపిక నశించిన ఒక రాయలసీమ వాసి గా, ఆంధ్రప్రదేశ్ పౌరునిగా అడుగుతున్నా.. నీటిని కోల్పోయాం, విద్యాలయాలను కోల్పోయాం, పరిశ్రమలను కోల్పోయాం, ఇంకెన్నాళ్లు రా... ఎవడు అడగడనా, ముందుకు రారనా?
ఒక్కటి గుర్తించుకోవాలి.. ప్రత్యేక హోదా వలన 90% గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, అలాగే 10% బడ్జెట్ లోన్ల రూపంలో వస్తాయి.. రాష్ట్రప్రభుత్వం తిరిగి ఆ గ్రాంట్లను చెల్లించవల్సిన అవసరం ఉండదు..ఆ విధంగా కొత్తగా విడిపోయిన రాష్ట్రానికి బడ్జెట్ పరంగా కేంద్రం నుంచి సహాయం పొందొచ్చు....ప్రత్యేక హోదా బిక్ష కాదు అడుక్కోడానికి, ఇది మన హక్కు.. ఎప్పుడో ఇవ్వాల్సింది..ఎదురుచూసాం...కానీ ఇప్పటికీ మనల్ని ఏమారుస్తూనే ఉన్నారు..చెప్పిన మాటని తప్పడం మీ రాజకీయ గురువిద్య ఏమో.. అది సాధించడం మా ప్రతిచర్య.. ప్రత్యేక హోదా మా హక్కు!
లేదు ..DP లను మాత్రమే మారుస్తాం లేదా వెధవ సోళ్లేసుకుర్చుంటాం, షరా మామూలు బతుకు బతుక్కుంటాం అంటే, OK Carryon!

Relangi Mavayya

ముగ్గురు మిత్రులు శ్రీరామ చంద్రుడి గుడిలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు...
అందులో మొదటి వాడు..
"మిత్రమా..మా హైదరాబాదు అందాలను చూసావా....
చార్మినార్ చరిత్ర.. గోల్కండ గమ్మత్తు, బిరియాని గుమగుమలు.. అబ్బబ్బబ్బా..నోరు ఉరిపోతుందనుకో..
ఆ చల్లటి సాయంత్రం.. అలా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి జాలువారుతుంటే..అబ్బ......ఏదో తెలియని అనుభూతి..
మా హైద్రాబాదులోని హుస్సేన్ సాగర్ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవురా..
అలా హుస్సేన్ సాగర్ మధ్యలో చిన్న బోటులో తేెలుతుంటే..స్వర్గాన్ని ఇక్కడే చూస్తున్న అనుభూతి...
సుందరమైన రోడ్లు..వాటికి మరింత అందాన్ని ఇచ్చే పార్కులు.."
అని గత పదిహేను నిమిషాల నుంచి బ్రేకు లేకుండా ఒకటే బాదుడే బాదుడు..
ఇంతలో రెండో మిత్రుడు..
"ఆపరా సుంటా..అదే పాత నాలుగు స్తంభాల భవనం..అవే రాతి గోడలు, రాళ్ళు, రెప్పలు..ఇక బిరియాని మొదటి సారి తిన్నప్పుడు బాగుంది..రెండో రోజు పర్లేదు..మూడో రోజు ఇబ్బందిగా కనిచ్చా..నాలుగో రోజు నమస్కారం మీ బిరియానికి..
ఏంటేంటి..హైటెక్ సిటీ రోడ్డులో జాలువ్రాలుతావా.. ఇంకా నయం రోడ్ రాష్ గేమ్ ఆడుతాను అనలేదు.. ఒకటే దుమ్ము ధూళి..జీవితకాలంలో సగ భాగం ట్రాఫిక్కు పద్మవ్యూహంలో ఇరుక్కుపోతాం రా రే..
హుస్సేన్ సాగర్ మూసి నది నీరా..? వినాయక నిమ్మజ్జనాలకి తప్ప దేనికీ పనికిరాదు.."
అంటూ మొదటి వాడికి ఫిడేల్ అని వాయించి...
"మా వైజాగ్ బీచులాంటిది మీ హైదరాబాదులో ఎక్కడైనా ఉందట్రా..పచ్చని పల్లెలు..అరకు లోయల అందాలు.. కాకినాడ కాజా.. బాపట్ల బాజా.. పిఠాపురం పూజ......"
అంటూ మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు అందుకున్నాడు....
ఇక లాభం లేదనుకొని మా సీమ ప్రతిభా పాటవాలను వాళ్ళకి కనీసం ముప్పై నిమిషాలయినా రుచి చూపించాలి అని చొక్కా మడిచి రంగం సిద్ధం చేస్కుంటుండగా..ఇంతలో...
రేలంగి మావయ్య ఎదురయ్యి.. దగ్గరకు వచ్చి కూర్చొని మా వైపు చూసి నవ్వుతూ..
"ఎందుకంట్రా.. ఈ గొప్పలు.. తిప్పలు.. మనందరం ఒకే భూమి బిడ్డలం.. ప్రాంతం అనేది మనం కల్పించుకున్న భావన రా.. ఆ శ్రీరామ చంద్రుడిని చూడండి.. కులం మతం ప్రాంతం వర్ణం తేడా లేకుండా అడవులకు వెళ్లి ఎంతటి వారైనా సమానమే అని మనకు సత్యాన్ని తెలిపాడు....."
అంటూ నవ్వుతూ మమ్మల్ని దగ్గరికి తీసుకొని తన చేతిలోని కొబ్బరి చిప్పని మూడు ముక్కలు చేసి మాకు పంచి.. నవ్వుతూ వెళ్ళిపోయాడు..
అప్పుడు అర్థం చేసుకున్నాం...ఆ కొబ్బరి ముక్క భూదేవి అని..మూడు ముక్కలుగా మనకి పంచిందని...
ఏదో ట్రై చేశా నచ్చుతే మీ అభిప్రాయం తెలుపండి..నొప్పున్చుంటే మన్నించండి.. 

Take on Fathers Day

(హ్యాపీ ఫాదర్స్ డే)... చాలా మందికి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కాని తెలీదు..ఈరోజు నాన్నల దినోత్సవం అని! హడావిడిగా నాన్నల మీద ప్రేమ పొంగుకొచ్చి నాన్నలతో ఎప్పుడో దిగిన సెల్ఫీలు(ఒకవేళ లేకపోతే దిగి మరీ..), నాన్నల మీద ఉన్న కవితలు(ఒకవేళ లేకపోతే సొంతంగా త్రివిక్రమ్ లా మారటం)... ఇవి కాదు..
నాన్న మీద నీకు మరీ అంతగా ప్రేమ ఉంటే, ముందు మీ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడు..ఒక్కసారి ఆయనకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పు.. ఆయన కళ్లలోని ఆనందం నీ గుండెలను తాకుతుంది..
అంతేకాని ఇలా నీ ప్రేమని లోకానికి తెలియపరచాల్సిన అవసరం లేదు.. ముందు మీ నాన్నకు తెలియపరుస్తే చాలు..నువ్వు ఈ ముఖ పుస్తకం లో మీ నాన్న గురించి ఎంత ప్రేమను చూపించనా కేవలం ఈ లోకం మాత్రమే చూస్తుందేమో, అవే మాటలు మీ నాన్న తో పంచుకో కాసేపు అంతర్జాలాన్ని పక్కన పెట్టి హాయిగా మాట్లాడు..అప్పుడు నీన్ను ప్రపంచానికి పరిచయం చేసిన వారికి(మీ నాన్నకి) నీ ప్రేమ చేరుతుంది..ఒకసారి చేసి చూడు..
ఒకవేళ నా ఈ మాటలు మిమ్మల్ని మీ మనోభావాల్ని గాయపరుస్తుంటే క్షమించగలరు..

My take on Conjuring 2

రాత్రి Conjuring 2 చూడటం జరిగింది..
డియర్ ఆడియన్స్..(అందులో నేనూ ఒకడిని) 
ఒక హార్రర్ సినిమాని కూడా కామెడీగా మార్చేస్తారేంటిరా బాబూ.. మాంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సీన్లో గట్టిగా నవ్వుతారు... ఎందుకు నవ్వుతున్నారు అని నాలో నేను ప్రశ్నించుకునే లోపే అందుకు సమాధానం స్క్రీన్ పై కనిపించిన దయ్యం! 
ఇక సినిమా చూసాక ఒంటరిగా బైక్ మీద ఇంటికి వెళ్తున్నప్పుడు భయబడటాలు, వెనుక నుంచి ఎవరో ఫాలో అవ్తున్నటు..ఇలాంటివి ఏవి ఈసారి జరగలేదు..సో ప్రాక్టికల్ గా కూడా సినిమా పార్ట్1 తో పోలిస్తే నాకేం పెద్ద తేడా కనిపించలేదు.. పెద్ద భయమూ లేదు. మొత్తానికి హాలీవుడ్ హార్రర్ సినిమాలు కూడా రొటీన్ అయిపోయాయి అనమాట.. బహుశా థియేటర్ లో చూసినందుకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందేమో..చూద్దాం..హోమ్ థియేటర్ లో చూసిన తర్వాత ఒపీనియన్ మారుతుందేమో..

A Small take on Hyderabad Traffic

మై డియర్ హైదరాబాద్ సిటిజన్స్ (కొంతమంది)...నాకొక డౌటు.. మీకు కారు ఉంది అనే విషయం సిటీ మొత్తం తెలియాలని అలా రోడ్ల మీదికి తెస్తున్నారా లేక..సిటీలో ట్రాఫిక్ చాలా తక్కువ అని తెలిసి రోడ్లని నింపడానికి ప్రయత్నిస్తున్నారా? 
కారణం ఏదైతే ఏంటి..మా డబ్బులు మా కారు మా ఇష్టం అంటారా..రేయ్ బాబు ఒక్కటి చెప్తాను వినండి..
అసలే ట్రాఫిక్ ఎక్కువై గంటలు గంటలు కాదు కాదు జీవితంలో ఎక్కువ శాతం రోడ్ల మీద గడిపేస్తుంటే.. కారులో ఒక్కడు ఉంటాడు..వాడు కూడా కార్ వేస్కుని రోడ్ పై అడ్డంగా వెళ్ళడమే..కనీసం మీ ఫామిలీ ఉన్నపుడు కార్ వెస్కొచ్చినా పర్లేదు..అంతే కాని ఒక్కడికే పెద్ద పెద్ద కార్లు ఎందుకు...మారండి రా.. డోంట్ క్రియేట్ ట్రాఫిక్..ట్రై టు క్లియర్ ట్రాఫిక్!

About My First Bilingual Feature Film Aithe 2.0 / Pirates 1.0 (In Promotions)

ఇది తొడగొట్టి మీసం మెలేసి అమాంతం రైలును ఆపి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగే సాధారణ సినిమా మాత్రం కాదు.
అవును..మీరు వింటుంది నిజమే..ఇందులో మాస్ మసాలా ఐటెం పాటలు ఉండవు..భీకరమైన మాటలు సుమో బ్లాస్టులు అసలే ఉండవు ఊర మాస్ కాదు అలా అని సుతి మెత్తగా సాగిపోయే క్లీన్ చిత్రమూ కాదు..మరి ఏంటి?
అసలు మన మూవీ ఎలా ఉండబోతోంది??
అక్కడికే వస్తున్నాం.. ఒక మంచి సినిమాని తీస్తే ఎంత మంది ఆదరిస్తున్నారు..అదే ఎంతమంది ఆడనిస్తున్నారు..??
ప్రస్తుత కాలంలో సినిమాలు చూస్తున్న జనం కొంత జ్ఞానోదయం పొందారు. అదే ఒక ఐటెం సాంగు రెండు బౌంసింగ్ ఫైట్లు నాలుగు రొటీన్ కామెడీ పంచ్లు...ఇలా విసుగొచ్చే పకోడీ చిత్రాలను పక్కన పెడుతున్నారు..మంచి సినిమాకి మంచి రోజులు వచ్చాయి.. ఈ మంచి సమయంలొనే మా డైరెక్టర్ సర్ రాజ్ గారు చేస్తున్న విభిన్న ప్రయత్నమే మన ఐతే 2.0
It's India's first Techno thriller...అని చెప్తున్నందుకు గర్వంగా ఉంది.
ముందే చెప్తున్నాం తమ్ముళ్లు..మన సినిమాలో డప్పుల కొట్టుడు వినపడదు..రోత హాస్యంకి అవకాశం లేదు.. ప్రయోగాత్మక కథతో ఆసక్తి రేపే కథనంతో..మైమరిపించే మూడు పాటలతో నూతన నటీ నటులతో త్వరలో మీ ముందుకు వస్తున్నాం..అలనాడు ఐతే అనే సినిమా ఎలాగయితే మీ ఆలోచనల్లో నిలిచిపోయిందో..అలాగే మా ఈ చిత్రం కూడా మీకు నచ్చుతుంది..!
ఇందులో మా మొదటి ఆలోచన..నంగా పోస్టర్ విడుదల..ఇదే ఊపులో ఎవరూ చేయనివిధంగా ఆడియో విడుదలని ప్లాన్ చేయడం..అవును దాదాపు 2 లక్షల స్టూడెంట్స్ మొబైల్స్ లో వాట్సాప్ ద్వారా సాంగ్ లాంచ్ చేయడం..ఇది నాకు తెలిసి ఒక రికార్డ్.. గతంలో ఎవరూ చేయనటువంటిది..

చూద్దాం..మా ఈ చిన్న చిత్రాన్ని ఎంత పెద్దగా ఆదరిస్తారో...! 

Mother

అమ్మ.. నా మధురమైన జ్ఞాపకం. అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే..ఎందుకంటే అమ్మ గురించి నేను మాట్లాడే మాటలు వర్ణించలేనివి.. ఒకవేళ నేను సాహసించి ఆ దేవతను వర్ణించినా తను వినలేదు.. చూడలేదు! 
కాని నాకు గట్టి నమ్మకం..అమ్మ ఈ లోకంలో భౌతికంగా లేకపోయినా, నా మాటల్లో నా ఊహల్లో నా ప్రతి అడుగులోను అమ్మ లీనమై ఉంటుంది.
ఈ రోజు మాతృదినోత్సవం అంట. ఈరోజు అందరూ తల్లిని పొగుడుతూ పోస్ట్ చేస్తుంటే అవి చూసినపుడు బాధగా ఉంటుంది. అమ్మకు ఒక్క రోజు ఉండటం తప్పు కాదు..కాని ఒక్క రోజు మాత్రమే ఉండటం తప్పు.
అవును..అమ్మ చేతి ముద్దలు తిన్నాను..అమ్మ ఒడిలో ఆటలాడాను..అమ్మను విసిగించాను.. కోపం తెప్పించాను.. కాని ఏం చేసినా మన మంచి కోరే దేవతే అమ్మ.
అమ్మతో జీవితం మొత్తం ఉండలేకపోయాను. ఈ లోకం లో లేకపోయినా ఎక్కడో చోట నా ఆనందం కోసం తపిస్తూనే ఉంటుంది అమ్మ.
Miss you amma! 

Open Letter about Human Life Now a days.. ( Published in Vaartha News Paper )


Fan Made Poster of Meeku Meere Maaku Meme Film by Me


This awesome song with inspiring lyrics made my day

This awesome song with inspiring lyrics made my day..!


ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకూ...మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్నుపాలు కానీకూ...కష్టమనేది లేని రోజంటు లేదు కదా...కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా హో....అమ్మ కడుపు వదిలిన అడుగడుగూ హో....ఆనందం కోసమే ఈ పరుగూ హో....కష్టాల బాటలో కడ వరకూ హో.... చిరునవ్వు వదలకుహో....... హో.... ఓ హో....... ఓ.....
నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలునువు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచియని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు కీడూ... అనుభవాలేగా రెండూ....దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనాతలో పాత్ర వెయ్యకుంటే కాల యాత్ర కదిలేనా వావ్..వావ్..వావ్..నడి సంద్రమందు నిలిచాకా ....వావ్..వావ్..వావ్..ఎదురీదకుండ మునకేస్తావా ....వావ్..వావ్..వావ్..నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని హో.... ఆ దరికి చేర్చవాపుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలేబతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే చీకటిలో నిశి రాతిరిలో నీ నీడ కూడ నిను వదులునులే నీ వారు అను వారెవరు లేరంటు నమ్మితే మంచిదిలే చితి వరకు నీతో నువ్వే... చివరంట నీతో నువ్వే...చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనె లేదనుకో నీకన్నుల్లొ నీరు తుడిచే చేయి కూడ నీదనుకో ...వావ్..వావ్..వావ్..లోకాన నమ్మకం లేదసలే ......వావ్..వావ్..వావ్..దాని పేరు మోసమై మారెనులే .....వావ్..వావ్..వావ్...వేరెవరి సాయమో ఎందుకులే .వావ్..వావ్..వావ్..... నిను నువ్వు నమ్ముకో
చిత్రం: మిస్టర్ నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిచరణ్

~ Dhanush dialogue in Raghuvaran Btech ♡♡ ☆☆...

~ Dhanush dialogue in Raghuvaran Btech ♡♡ ☆☆...
Empikthav ra...Era erripappa.........Etu vanti kastamu padakunda asalu Aa qualification lekapoyina me nanna vunnodu ani vokey vokka karanamtho chamata kuda patakunda straight ga MD chair lo kurchuna nekay intha pogaruntay .. .....
Amma nanna thippalpadi school fees kadithay LKG nunchi 10th class varaku kastapadi chadhivi pass ayyi inter loo easy ga vunna subject groups anni vadhilesi MPC chadhivithaney engineer avagalam ani chepthay kastamaina adhay group select cheskuni physics ki oka tution chemistry ki oka tution maths ki oka tution ani road lu pattukuni thirigi aaaa fees kattu e fees kattu ani himsa petti board exam pass avadaniki rathri antha chadhavadaniki alarm petukuni podhuney legisi malli chadhivi thira pass ayyaka Eamcet lo rank rakapoyina long term thisukuni akadiki saraina rank raka amma nagalu thakattu petti management quota lo seat sampadhinchi telugu medium nunchi vachina naku english ardhamkaka 1st year nunchi 4th year dhaka vunna supplies anni 4th year lo okesari clear chesi e society loki vasthay e janamantha vudhyogamleni yadhava ani nechanga matladthuntay lekkacheyaka vudhyogam kosam aaa office e offisu ani pichikukkala nalegellu ga thiruguthuna nannu endhuku panikiravu thindi dhandaga thindi dhandaga ani ma nanna thiduthuntay oko methuku gonthulo dhigaka mullula gurchukuntuntaymingaleka kakkaleka chasthu brathukuthuna nannu.evaro oka mahanubavudu manchi manasutho oka avakasam isthay dhanni kuda lageskovalanukuntuna nelanti bavers gadni yedhirinchi e roju ne mundhu nunchuni matladthunavudhogamleni graduate ni nakentha Pogarundalra.*_* ♡ ☆
#Im_also_btech_student 
Hatsoff to Dhanush _/\_ for this unstoppable continuous dialogue..!