Tuesday, November 14, 2017

Mother

అమ్మ.. నా మధురమైన జ్ఞాపకం. అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే..ఎందుకంటే అమ్మ గురించి నేను మాట్లాడే మాటలు వర్ణించలేనివి.. ఒకవేళ నేను సాహసించి ఆ దేవతను వర్ణించినా తను వినలేదు.. చూడలేదు! 
కాని నాకు గట్టి నమ్మకం..అమ్మ ఈ లోకంలో భౌతికంగా లేకపోయినా, నా మాటల్లో నా ఊహల్లో నా ప్రతి అడుగులోను అమ్మ లీనమై ఉంటుంది.
ఈ రోజు మాతృదినోత్సవం అంట. ఈరోజు అందరూ తల్లిని పొగుడుతూ పోస్ట్ చేస్తుంటే అవి చూసినపుడు బాధగా ఉంటుంది. అమ్మకు ఒక్క రోజు ఉండటం తప్పు కాదు..కాని ఒక్క రోజు మాత్రమే ఉండటం తప్పు.
అవును..అమ్మ చేతి ముద్దలు తిన్నాను..అమ్మ ఒడిలో ఆటలాడాను..అమ్మను విసిగించాను.. కోపం తెప్పించాను.. కాని ఏం చేసినా మన మంచి కోరే దేవతే అమ్మ.
అమ్మతో జీవితం మొత్తం ఉండలేకపోయాను. ఈ లోకం లో లేకపోయినా ఎక్కడో చోట నా ఆనందం కోసం తపిస్తూనే ఉంటుంది అమ్మ.
Miss you amma! 

No comments:

Post a Comment