Tuesday, November 14, 2017

Relangi Mavayya

ముగ్గురు మిత్రులు శ్రీరామ చంద్రుడి గుడిలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు...
అందులో మొదటి వాడు..
"మిత్రమా..మా హైదరాబాదు అందాలను చూసావా....
చార్మినార్ చరిత్ర.. గోల్కండ గమ్మత్తు, బిరియాని గుమగుమలు.. అబ్బబ్బబ్బా..నోరు ఉరిపోతుందనుకో..
ఆ చల్లటి సాయంత్రం.. అలా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి జాలువారుతుంటే..అబ్బ......ఏదో తెలియని అనుభూతి..
మా హైద్రాబాదులోని హుస్సేన్ సాగర్ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవురా..
అలా హుస్సేన్ సాగర్ మధ్యలో చిన్న బోటులో తేెలుతుంటే..స్వర్గాన్ని ఇక్కడే చూస్తున్న అనుభూతి...
సుందరమైన రోడ్లు..వాటికి మరింత అందాన్ని ఇచ్చే పార్కులు.."
అని గత పదిహేను నిమిషాల నుంచి బ్రేకు లేకుండా ఒకటే బాదుడే బాదుడు..
ఇంతలో రెండో మిత్రుడు..
"ఆపరా సుంటా..అదే పాత నాలుగు స్తంభాల భవనం..అవే రాతి గోడలు, రాళ్ళు, రెప్పలు..ఇక బిరియాని మొదటి సారి తిన్నప్పుడు బాగుంది..రెండో రోజు పర్లేదు..మూడో రోజు ఇబ్బందిగా కనిచ్చా..నాలుగో రోజు నమస్కారం మీ బిరియానికి..
ఏంటేంటి..హైటెక్ సిటీ రోడ్డులో జాలువ్రాలుతావా.. ఇంకా నయం రోడ్ రాష్ గేమ్ ఆడుతాను అనలేదు.. ఒకటే దుమ్ము ధూళి..జీవితకాలంలో సగ భాగం ట్రాఫిక్కు పద్మవ్యూహంలో ఇరుక్కుపోతాం రా రే..
హుస్సేన్ సాగర్ మూసి నది నీరా..? వినాయక నిమ్మజ్జనాలకి తప్ప దేనికీ పనికిరాదు.."
అంటూ మొదటి వాడికి ఫిడేల్ అని వాయించి...
"మా వైజాగ్ బీచులాంటిది మీ హైదరాబాదులో ఎక్కడైనా ఉందట్రా..పచ్చని పల్లెలు..అరకు లోయల అందాలు.. కాకినాడ కాజా.. బాపట్ల బాజా.. పిఠాపురం పూజ......"
అంటూ మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు అందుకున్నాడు....
ఇక లాభం లేదనుకొని మా సీమ ప్రతిభా పాటవాలను వాళ్ళకి కనీసం ముప్పై నిమిషాలయినా రుచి చూపించాలి అని చొక్కా మడిచి రంగం సిద్ధం చేస్కుంటుండగా..ఇంతలో...
రేలంగి మావయ్య ఎదురయ్యి.. దగ్గరకు వచ్చి కూర్చొని మా వైపు చూసి నవ్వుతూ..
"ఎందుకంట్రా.. ఈ గొప్పలు.. తిప్పలు.. మనందరం ఒకే భూమి బిడ్డలం.. ప్రాంతం అనేది మనం కల్పించుకున్న భావన రా.. ఆ శ్రీరామ చంద్రుడిని చూడండి.. కులం మతం ప్రాంతం వర్ణం తేడా లేకుండా అడవులకు వెళ్లి ఎంతటి వారైనా సమానమే అని మనకు సత్యాన్ని తెలిపాడు....."
అంటూ నవ్వుతూ మమ్మల్ని దగ్గరికి తీసుకొని తన చేతిలోని కొబ్బరి చిప్పని మూడు ముక్కలు చేసి మాకు పంచి.. నవ్వుతూ వెళ్ళిపోయాడు..
అప్పుడు అర్థం చేసుకున్నాం...ఆ కొబ్బరి ముక్క భూదేవి అని..మూడు ముక్కలుగా మనకి పంచిందని...
ఏదో ట్రై చేశా నచ్చుతే మీ అభిప్రాయం తెలుపండి..నొప్పున్చుంటే మన్నించండి.. 

No comments:

Post a Comment