జ్ఞాపకం కన్నీళ్లను మిగులిస్తే.. ఆకలి ఆశయాన్ని ప్రేరేపిస్తుంది. నీ ఆకలే నీ ఆయుధం, కసితో ముందడుగేయ్.. చరిత్ర సృష్టిస్తున్నప్పుడు ఎంతోమంది ఎర్రిపూ*గాళ్ళు నీ దారికి అడ్డొస్తారు, దాటుకుని వెళ్ళు మరీ అడ్డొస్తే చీల్చుకొని వెళ్ళు.. నీ సంకల్పం ముందు వాడెంత, ఇసుకరేణువంత. నీ కష్టాన్ని ఎన్నటికీ, ఎవరికి తెలియనీకు, నవ్విపోతారు. నీ బాధను బయటపెట్టకు, మరింత బాధపడేలా చేస్తారు, వారి ఆనందం కోసం. ఒక్కటే గుర్తుపెట్టుకో.. ఇది నీ జీవితం.. నీ విజయం చూసి గేలి చేసిన వారి గుండెలు అదిరిపోవాలి, అడ్డొచ్చిన ప్రతి పిండం పగిలిపోవాలి. నీ విజయం కోసం నువ్ చేయాల్సింది వెనుకడుగు వేయకపోవడమే. చరిత్రలో నిలిచిన ఎవడైనా పడుతూలేచిన వాడే, గుర్తుపెట్టుకో నిన్ను ఏదైనా ఆపగలుగుతుంది అంటే అది నీ మరణం మాత్రమే. అంత వరకు ఎగిసిపడుతూనే ఉండు, కెరటం లాగ.
(ఈ మాటలు నాకు నేను మాట్లాడుకున్న విజయ భాషితాలు, నాతోపాటు ఉండిపోయే శాశ్వతాలు, నన్ను కుమిలిపోకుండా ఉత్తేజపరుస్తున్న అపరిమిత శక్తి, అదే నేను.)
(ఈ మాటలు నాకు నేను మాట్లాడుకున్న విజయ భాషితాలు, నాతోపాటు ఉండిపోయే శాశ్వతాలు, నన్ను కుమిలిపోకుండా ఉత్తేజపరుస్తున్న అపరిమిత శక్తి, అదే నేను.)
No comments:
Post a Comment