Tuesday, November 14, 2017

Special Status's Status

ఆనాడు పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసమే పోరాడాడు..ఈనాడు మనం కనీసం ఆ రాష్ట్రం యొక్క హక్కు కోసం ఉద్యమించలేమా?
ఒక సాంప్రదాయ క్రీడ కోసం ఆ రాష్ట్రం మొత్తం ఏకమయ్యారు..పూటకో కూత కూస్తు తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆనాడు నోరు జారి ఇప్పుడు మాట మారుస్తున్న రాజకీయ నాయకుల మెడలు వంచి మన భవిష్యత్ కోసం మన రాష్ట్రం కోసం ఏకమవ్వలేమా?
ఉన్నట్టుండి ఈ హడావిడి ఏంటో అని అపర మేధావి లాజిక్కులు మాట్లాడకండి.. చరిత్ర లోని ఏ విప్లవం అయినా చిన్న అడుగుతోనే మొదలయింది. పోరాడడాం, ఆనాడు మహానుభావులు మనకెందుకులే అనుకోనుంటే ఈనాడు మనం ఇలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదేమో..ఆవును జల్లికట్టు నిరసన మనకు స్ఫూర్తిదాయకం.
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటి ముదనష్టపు కామెంట్లు మానేసి నీ వంతుగా పోరాడటం మొదలెట్టు.. వీలైతే స్పెషల్ స్టేటస్ వలన మన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి నలుగురికి చెప్పు.. ఇంట్లో కూర్చుని వెధవ వెటకారం ఆపి బయటికి రా.. చెన్నై మెరినా జనాలని చూసి లైకులు కొట్టడం కాదు..నీ రాష్ట్రం భవిష్యత్తు గురించి అలోచించి మాట్లాడు..
ఏ రాజకీయ ఎదవ కూడా రాష్ట్రం కోసం నిజంగా చూడట్లేదు.. నటిస్తున్నారంతే. కులం, మతం , ప్రాంతం ఇవన్నీ వదిలేసి పోరాడు. హీరోల కోసం, హీరోయిన్ ల కోసం, రికార్డుల కోసం, గ్రాస్ ల కోసం, షేర్ ల కోసం కొట్టుకుంటారే.. మరి మన రాష్ట్రం కోసం.. మన భవిష్యత్ కోసం?
ఇదంతా మనకెందుకు రా బాబు మనం ఎన్నుకొన్న వాళ్ళు చూస్కుంటారుగా అంటారు కొంతమంది.. ఆ సో కాల్డ్ ఎన్నుకున్న సన్యాసులు ఏమి పీకలేక ఒకడు 5 ఏళ్లు అని మాట అంటే, ఇంకోడు లేదు మా వాళ్లకి 10 ఏళ్ళు కావాలి అని బ్లేడ్ ఏసాడు ఆనాడు.. గుర్తుందా? పోన్లే రాష్ట్రం ఎలాగూ విడిపోయింది, సర్ జీలు చెప్పినట్టు, పెరుగన్నం లాంటి ప్రత్యేక హోదా కోసం ఆశతో ఎదురుచూసిన సగటు నా లాంటి ప్రజల మొహాన వేడికాఫీ లో చిల్డ్ బీర్ కలిపి మొహాన కొట్టినట్టు ప్యాకేజి ని ముందుకు తెచ్చారు. ఈ ప్యాకెజి తో ఏ ముడ్డి తుడ్చలేము..అది వారిికీ తెలుసు. టాక్స్ లు, పెట్రోల్ , డీజిల్ , గ్యాస్, వైన్స్ ఇలా అన్నింటా వసూళ్లు కూడగొట్టి, తిరిగి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటో తెలుసా?
1. కేంద్ర ప్రభుత్వానికి గ్రాస్ ఇన్ కమ్ (నికర నష్టం) లాస్ లో ఉంది అని,
2. మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి వాదనలు వస్తాయని..
మరి విభజన బిల్లు సందర్భంలో ఇవన్నీ కనపడలేదా రా? అన్నిటిని చూస్తూ, భరిస్తూ ఎంతో కాలం మౌనంగా ఉంది ఇక ఓపిక నశించిన ఒక రాయలసీమ వాసి గా, ఆంధ్రప్రదేశ్ పౌరునిగా అడుగుతున్నా.. నీటిని కోల్పోయాం, విద్యాలయాలను కోల్పోయాం, పరిశ్రమలను కోల్పోయాం, ఇంకెన్నాళ్లు రా... ఎవడు అడగడనా, ముందుకు రారనా?
ఒక్కటి గుర్తించుకోవాలి.. ప్రత్యేక హోదా వలన 90% గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, అలాగే 10% బడ్జెట్ లోన్ల రూపంలో వస్తాయి.. రాష్ట్రప్రభుత్వం తిరిగి ఆ గ్రాంట్లను చెల్లించవల్సిన అవసరం ఉండదు..ఆ విధంగా కొత్తగా విడిపోయిన రాష్ట్రానికి బడ్జెట్ పరంగా కేంద్రం నుంచి సహాయం పొందొచ్చు....ప్రత్యేక హోదా బిక్ష కాదు అడుక్కోడానికి, ఇది మన హక్కు.. ఎప్పుడో ఇవ్వాల్సింది..ఎదురుచూసాం...కానీ ఇప్పటికీ మనల్ని ఏమారుస్తూనే ఉన్నారు..చెప్పిన మాటని తప్పడం మీ రాజకీయ గురువిద్య ఏమో.. అది సాధించడం మా ప్రతిచర్య.. ప్రత్యేక హోదా మా హక్కు!
లేదు ..DP లను మాత్రమే మారుస్తాం లేదా వెధవ సోళ్లేసుకుర్చుంటాం, షరా మామూలు బతుకు బతుక్కుంటాం అంటే, OK Carryon!

No comments:

Post a Comment