Tuesday, November 14, 2017

About Dasari garu

ఆయన గూర్చి విన్నదే గాని ప్రత్యక్షంగా చూసిందిలేదు, మా గురువు చెప్తోంటే ఆనందపడేవాడిని.. ఎందుకు ఆనందపడేవాడినంటే ఆయన గురించి చెబుతున్నప్పుడు మా గురువు కళ్ళల్లో ఆనంద భాష్పాలను చూసాను కాబట్టి, ఆయన గూర్చి దాదాపు మంచే ఎక్కువుగా విన్నాను, కాబట్టి ఆయన గూర్చి మాట్లాడేంత పూర్తి జ్ఞానం నాకు సరిపోవడం లేదు.. కొంతమంది అంటారు ఒకడు చచ్చిపోతేనే వాడి గురించి మాటలు, పోస్టులు, రిప్పులు..ఇలా. కానీ తెగిపోతేనే దారం విలువ తెలుస్తుందని నేను బలంగా నమ్ముతాను, అయినా మానవులం కదా.. మన ఆలోచనలు ఇలానే ఉంటాయి. అయినా 151 సినిమాలు తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క సినిమా తీయడానికి ఎంత పెద్ద తతంగం ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది దాదాపు 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అన్ని చిత్రాలను రూపొందించడం ఊహాద్భుతం. మా గురువు చెప్పేవాడు.. ఆయన తనతో పనిచేసేవారిని ఎంత బాగా చూసుకునేవారని.. ముఖ్యంగా ప్రతిభను గుర్తించి అభినందించేవారని.. ఆ అభినందనలు అందుకున్న ఎంతోమంది నేడు దర్శకులుగా ఉన్నారు. కానీ ఆయన సినీ జీవితం గమనిస్తే ఒక హిట్ వస్తే..మరోటి ఫ్లాప్ గా మారేది. అయినా సరే అలుపెరగకుండా పడుతూ లేస్తూ ఎన్నో ఘనవిజయాలు ఆయన సొంతం. విజయం ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యం అన్నది ఆయన సినీ జీవితం నేర్పిన పాఠం. అదే నాకు, మరెంతో మందికి స్ఫూర్తిదాయకం. హిట్, ఫ్లాప్...ఆయన జీవితంలో ఎన్ని చూసింటాడండి.. అయినా చివరిదాకా సినిమా అనే సముద్రాన్ని ఈది చూపించాడు. ఇక సినీ కెరీర్ చివరిదశలో రాజకీయాల్లో ప్రవేశించి కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయినా నేను ఒక్కటి బలంగా నమ్ముతాను..ఒక వ్యక్తి మంచో చెడో అన్నది అవతలివాడు ఆలోచించే తీరులో ఉంటుంది. వాడు వీణ్ణి మంచి అని అనుకుంటే మంచోడే, చెడు అను భావిస్తే దుర్మార్గుడె ఇంక. అయినా మంచి చెడు అనేవి మనం కల్పించుకున్న ఊహలే.. తప్పులనేవి మానవ సహజం, ఒకడిని తప్పుపట్టే ముందు మనం ఎంత పతీతులమో గ్రహించాలి. శ్రీకృష్ణుడు అంతటివాడు భక్తుల పాయింట్ అఫ్ వ్యూ లో మంచివాడు, మరి చీరలు దొంగలింపబడ్డ మహిళల పాయింట్ అఫ్ వ్యూలో ఎప్పటికి చెడ్డోడే. నేను ఎప్పుడు అవతలోడిలో మంచినే ఎక్కువ చూస్తాను. కాబట్టి దాసరి నాకెప్పుడూ మంచోడే, సినిమా పరంగా, ఇక రాజకీయాలంటారా..ఎవడు దోచుకోలేదండి, రాజకీయం అంటేనే.. దెం**తినడం, సో నో కామెంట్.
కానీ ఎంతటివాళ్ళైనా చివరికి మట్టిలో కలవాల్సిందే ! ఈ సత్యాన్ని మా అమ్మ పోయినప్పుడే నేను జీర్ణించుకున్నాను. సో, నా దృష్టిలో చావు అనేది ఒకరి జన్మకారణకార్యం పూర్తయ్యాక కల్పించబడే శాశ్వతనిద్ర !
'జాతస్య హి దృవో మృత్యుర్దృవం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే న త్వామ్ సోచింతుమర్హసి'
'పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి సోకింప తగదు'.

No comments:

Post a Comment