Tuesday, November 14, 2017

Take on Fathers Day

(హ్యాపీ ఫాదర్స్ డే)... చాలా మందికి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కాని తెలీదు..ఈరోజు నాన్నల దినోత్సవం అని! హడావిడిగా నాన్నల మీద ప్రేమ పొంగుకొచ్చి నాన్నలతో ఎప్పుడో దిగిన సెల్ఫీలు(ఒకవేళ లేకపోతే దిగి మరీ..), నాన్నల మీద ఉన్న కవితలు(ఒకవేళ లేకపోతే సొంతంగా త్రివిక్రమ్ లా మారటం)... ఇవి కాదు..
నాన్న మీద నీకు మరీ అంతగా ప్రేమ ఉంటే, ముందు మీ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడు..ఒక్కసారి ఆయనకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పు.. ఆయన కళ్లలోని ఆనందం నీ గుండెలను తాకుతుంది..
అంతేకాని ఇలా నీ ప్రేమని లోకానికి తెలియపరచాల్సిన అవసరం లేదు.. ముందు మీ నాన్నకు తెలియపరుస్తే చాలు..నువ్వు ఈ ముఖ పుస్తకం లో మీ నాన్న గురించి ఎంత ప్రేమను చూపించనా కేవలం ఈ లోకం మాత్రమే చూస్తుందేమో, అవే మాటలు మీ నాన్న తో పంచుకో కాసేపు అంతర్జాలాన్ని పక్కన పెట్టి హాయిగా మాట్లాడు..అప్పుడు నీన్ను ప్రపంచానికి పరిచయం చేసిన వారికి(మీ నాన్నకి) నీ ప్రేమ చేరుతుంది..ఒకసారి చేసి చూడు..
ఒకవేళ నా ఈ మాటలు మిమ్మల్ని మీ మనోభావాల్ని గాయపరుస్తుంటే క్షమించగలరు..

No comments:

Post a Comment