Tuesday, November 14, 2017

Death of Life

మరణం.. మాట వినగానే ఇప్పటికి తప్పుకుంటావు, కానీ ఎప్పటికైనా భయపడతావు, ఎందుకంటే మరణమనేది ఒక నిజం. జీవితకాలం నువ్వు సంపాదించిన ఆస్తులు, పంచుకున్న ప్రేమలు, ఏర్పరుచుకున్న బంధాలు, కుమిలిపోయిన క్షణాలు ఇవన్నీ జీవితంలో ఒక భాగం. ఇవేవీ నీతో పాటు చివరివరకు రావు. మరణం నీ కోసం వస్తుంది. నేను అని బతుకుతున్న నిన్ను, అసూయ ద్వారం నుంచి బయటకు తీసుకెళుతుంది. కాలం లేనిదే మరణం, నేను కానిదే మరణం, స్వార్ధం లేనిది మరణం, అసూయద్వేషాలు తెలియనిది మరణం. జీవనం, మరణం రెండూ ఏకమై ఆడుకునే ఆటే నీ జీవితం, ఈ బంధాలన్నిటిని వదిలేస్తావా, లేక ఈ కలుషిత జీవితంలో మరోసారి మునుగుతావా? మరణం వెనుక ఉన్న అందం నీకు తెలియదు. అది అనంతం.

No comments:

Post a Comment