Tuesday, November 14, 2017

The Power Lies within you..

ఎవడన్నాడ్రా ఒంటరివని..
ఎవడన్నాడ్రా ఓడిపోతావని..
ఏడ్చి ఏడ్చి ఇంకిపోతున్న ప్రతి కన్నీటిచుక్కా..
బాధను లోలోనే ఒడిసిపట్టుకొనున్న మెదడులోని ప్రతి కణమూ..
కిందపడ్డ ప్రతిసారీ బయటకొస్తున్న మరిగే రక్తపు ధారా..
గెలుపు ఆకలిని పరిచయం చేసే ప్రతి ఆలోచనా..
ఓడిపోకూడదు అని పడుతూ లేచి వేసే ప్రతి అడుగూ..
గమ్యం వాసనని పసిగట్టి మోగే నీ ప్రతి గుండెచప్పుడూ..
ఇవన్నీ.. ఇవన్నీ నీ చుట్టాలే..
ఇవన్నీ నీ గెలుపు అంచుల్లో నీ మొహంలోని వెలుగును చూసేందుకు చీకటిలో తపిస్తున్న నీ స్నేహితులే..
ఇవన్నీ నువ్వే.

1 comment: